బాలయ్య తర్వాత మరో టాక్ షో లో కనిపించనున్న పవన్.?

బాలయ్య తర్వాత మరో టాక్ షో లో కనిపించనున్న పవన్.?

Published on Oct 29, 2022 2:01 PM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ చిత్రం “హరిహర వీరమల్లు” షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా షూటింగ్ తో పాటుగా పవన్ పాలిటిక్స్ లో కూడా తాను బిజీగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాతో పాటుగా రానున్న రోజుల్లో పవన్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తో తన టాక్ షో అన్ స్టాప్పబుల్ 2 లో కనిపించనుండడం ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యింది.

ఇక దీని తర్వాత అయితే పవన్ మరో టాక్ షో లో కనిపించనున్నట్టుగా టాక్ ఇప్పుడు బయటకి వచ్చింది. పవన్ స్నేహితుడు ప్రముఖ నటుడు అలీ వ్యాఖ్యాతగా చేస్తున్నటువంటి షో ఆలీ తో సరదాగా షో లో పవన్ కనిపించనున్నట్టుగా ఆలీ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో అయితే పవన్ తన షో లో కనిపించే ఛాన్స్ ఉన్నట్టుగా హింట్ ఇచ్చాడు. దీనితో ఈ టాక్ మంచి వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు