‘భీమ్లా’ తర్వాత పవన్ కి రికార్డు స్థాయి రెమ్యునరేషన్.?

Published on Sep 8, 2021 8:01 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు మొదలు పెట్టి శరవేగంగా వాటిని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. కరోనా కారణంగా కొన్నాళ్ళు లేట్ అయినా తాను మళ్ళీ కం బ్యాక్ ఇచ్చాక చాలా సినిమాలు ఓకే చేసేసి వరుసగా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. అయితే పవన్ మళ్ళీ కం బ్యాక్ ఇవ్వడంతో తన సినిమాలకి భారీ రెమ్యునరేషన్స్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయ్యారు.

అలాగే మరో పక్క తన సినిమాకి ఒక్కో రోజుకి కోటి రూపాయల వరకు కూడా ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారని తన రెమ్యునరేషన్ పట్ల చాలానే వార్తలు ఆ మధ్య వినిపించాయి. ముఖ్యంగా ఇప్పుడు చేస్తున్న “అయ్యప్పణం కోషియం” రీమేక్ “భీమ్లా నాయక్” కి భారీ మొత్తంలో 50 నుంచి 55 కోట్లు పవన్ రెమ్యునరేషన్ గా తీసుకున్నారని టాక్ వచ్చింది.

అయితే ఇప్పుడు దీనిని బ్రేక్ చేస్తూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ హరీష్ శంకర్ తో చేస్తున్న సినిమాకి ఏకంగా 60 కోట్లు తీసుకుంటున్నారని గాసిప్స్ ఇప్పుడు మొదలయ్యాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో కానీ ఈ టాక్ వైరల్ అవ్వడం మొదలయ్యింది.

సంబంధిత సమాచారం :