“సర్కారు వారి” నుంచి కూడా క్లారిటీ వస్తే సరి.!

Published on Oct 16, 2021 7:15 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ స్టైలిష్ ఎంటర్టైనర్ ఇప్పుడు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుండగా గత కొన్ని రోజులు నుంచి ఈ చిత్రం అనధికారికంగా వాయిదా పడ్డట్టుగా ఒక టాక్ అయితే ఉంది.

భారీ చిత్రం “RRR” రేస్ లోకి రావడంతో ఈ చిత్రం సంక్రాంతి బరి నుంచి రాజమౌళి కోసం తప్పుకున్నట్టుగా తెలిసింది. అయితే ఇంకా ఇందులో ఎలాంటి అధికారిక క్లారిటీ లేకున్నా మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “భీమ్లా నాయక్” కూడా వాయిదా పడుతుంది అనుకున్నారు.

కానీ మేకర్స్ మాత్రం ఈరోజు వచ్చిన “అంత ఇష్టం” వరకు కూడా డేట్ ని మార్చలేదు. అదే జనవరి 12 న ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. దీనితో సర్కారు వారి పాట సినిమా రిలీజ్ డేట్ పట్ల మరింత ఆసక్తి నెలకొంది. సో దీని నుంచి కూడా ఈ మధ్యలో ఏమన్నా క్లారిటీ వస్తే సరి..

సంబంధిత సమాచారం :