“అఖండ” సక్సెస్ లో బోయతో అతడికి సింహ భాగం.!

Published on Dec 3, 2021 9:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “అఖండ” నిన్న విడుదల అయ్యి భారీ సక్సెస్ అందుకుంది. మాస్ ఆడియెన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను వేరే లెవెల్ మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించారు.

అయితే ఈ సినిమాకి సక్సెస్ లో దర్శకుడు బోయపాటి శ్రీను పెట్టిన మాస్ ఎలివేషన్స్ కి ఎంతతైతే రెస్పాన్స్ వస్తుందో వాటిని తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఇంకో లెవెల్ మాస్ లో నిలబెట్టిన సంగీత దర్శకుడు థమన్ కి కూడా సింహ భాగం దక్కుతుంది అని అంటున్నారు. సినిమా చూసాక నార్మల్ మూవీ లవర్స్ లో అయితే ఇదే మాట మొదట వస్తుంది.

మాస్ సీన్స్ ని థమన్ తన మ్యూజిక్ తో ఇంకో లెవెల్ మాస్ గా చూపించాడని. అందుకే ఈ సినిమా సక్సెస్ లో డెఫినెట్ గా థమన్ పేరు ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం థమన్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ముందు భారీ ప్రాజెక్ట్స్ కి ఎలాంటి సంగీతం అందిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :