బ్రేకప్ తర్వాత దీప్తి అలా.. షన్ను, సిరి లు మాత్రం ఇలా.!

Published on Jan 4, 2022 1:00 pm IST

సోషల్ మీడియా లో మంచి పాపులర్ అయ్యినటువంటి యూట్యూబ్ స్టార్స్ షణ్ముఖ్ జస్వంత్ అలాగే దీప్తి సునైనాల కోసం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కొంతమంది యూత్ లో వీరికి మంచి క్రేజ్ ఉంది. ఇక అలాగే వీరిద్దరూ కూడా ఎప్పుడు నుంచో డేటింగ్ లో ఉన్న సంగతి కూడా వారు అందరికీ తెలుసు. కానీ రీసెంట్ గానే వారై బ్రేకప్ కి సంబంధించి ఓ అధికారిక క్లారిటీ కూడా దీప్తి ఇచ్చేసింది.

ఇక ఆ తర్వాత ఆమెకి మరిన్ని ప్రశ్నలు ఎదురు కాగా ఈ విషయంలో ఆమెనే ఒకింత ఎక్కువ ఎమోషనల్ గా కనిపించింది. అయితే మరో పక్క బిగ్ బాస్ షో తో మరింత క్రేజ్ తెచ్చుకున్న షన్ను మాత్రం ఆ షో లో తన తోటి కంటెస్టెంట్ సిరి తో కలిసి ఉండడం వారి మధ్య కెమిస్ట్రీ తో అప్పట్లోనే చాలా మందికి అనుమానాలు మొదలయ్యాయి.

మరి ఇప్పుడు అయితే ఓ పక్క దీప్తి తన బ్రేకప్ అనంతరం ఎమోషనల్ గా ఉండగా షన్ను, సిరి లు మాత్రం వారి మరో కంటెస్టెంట్ అయినవంటి జెస్సి తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. దీనితో వీరిపై మరిన్ని ట్రోల్స్ నెటిజన్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :