మహేష్ బాబు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ విలేజ్.!

Mahesh-Babu
ఎప్పుడైతే రీల్ లైఫ్ లో హీరోలుగా కనిపించే స్టార్స్ రియల్ లైఫ్ లో కూడా అసలైన హీరోలు అనిపించుకుంటారో అప్పుడు వారి పేరు ప్రఖ్యాతలు అమాంతం పెరిగిపోవడమే కాకుండా అభిమానుల్లో, ప్రేక్షకుల మదిలో కలకాలం నిలిచిపోతారు. ఇప్పుడు అలాంటి సంఘటనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలోనూ జరిగింది. మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు ‘మన పల్లెటూళ్ళని మనమే కాపాడుకోవాలని, అవసరం అయితే దత్తత తీసుకొని మరీ బాగు చెయ్యాలనే సందేశాన్ని’ ఇచ్చారు.

ఆ సందేశాన్ని మహేష్ బాబు సినిమాలో చెప్పి వదిలేయకుండా తన రియల్ లైఫ్ లో కూడా దీన్ని ఆచరించాడు. మహేష్ బాబు తన సొంత ఊరు అయిన ‘బుర్రిపాలెం’ని దత్తత తీసుకొని డెవలప్ చేస్తానని తెలిపాడు. ఈ ఊరు డెవలప్ తర్వాత మహేష్ బాబు తెలంగాణ లో మరో విలేజ్ ని డెవలప్ చేయనున్నాడు. అసలు ఈ ఊరు దత్తత తీసుకోవాలనే కాన్సెప్ట్ కి తనకి స్ఫూర్తి ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్ అని మహేష్ తెలియజేశాడు.

‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టిన స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్ నుంచే నాకు నా సొంత ఊరు బుర్రిపాలెంని దత్తత తీసుకోవాలనుకున్నాను. దీనికి సహాయం చేసిన మా బావ మరియు గుంటూరు ఎం.పి జయదేవ్ గల్లాకి స్పెషల్ థాంక్స్. శ్రీమంతుడు చూసి తెలంగాణ మంత్రి కేటిఆర్ అభినందించడం చాలా హ్యాపీ, ఆయన గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా బాగా వెనుకబడిన జిల్లా అయిన మహబూబ్ నగర్లో ఓ విలేజ్ ని అడాప్ట్ చేసుకోమని సూచించారు, దానికి నేను వెంటనే ఓకే చెప్పేసాను. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తానని’ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. మహేష్ బాబు తీసుకున్న ఈ స్టెప్ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా మారనుంది.

Exit mobile version