‘మహాకాళి’: ‘హను మాన్’ మ్యాజిక్ రిపీట్ చేసిన ప్రశాంత్ వర్మ..!

మన టాలీవుడ్ సినిమా దగ్గర టాలెంటెడ్ యువ దర్శకుల్లో ప్రశాంత్ వర్మ కూడా ఒకరు. తన గత చిత్రం ‘హను మాన్’ తో పాన్ ఇండియా సంచలనం సెట్ చేసిన ఈ సినిమా తర్వాత తన నుంచి సెపరేట్ సినిమాటిక్ యూనివర్స్ ని సిద్ధం చేస్తూ ఒకో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాల్లో తాను కథ అందించిన లేడీ సూపర్ హీరో చిత్రమే ‘మహాకాళి’.

దర్శకురాలు పూజా కొల్లూరు తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన గ్లింప్స్ కోసమే ఇపుడు అంతా మాట్లాడుకుంటున్నారు. సరిగా ఇదే ప్రశాంత్ వర్మ నుంచి వచ్చిన ‘హను మాన్’ టీజర్ కి వచ్చిన యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ఇప్పుడు మహాకాళి గ్లింప్స్ కూడా కనిపిస్తుండడం విశేషం. హను మాన్ తర్వాత ప్రశాంత్ వర్మపై పలు ట్రోల్స్ కూడా వచ్చాయి.

ఏ ఐ అది ఇది అంటూ.. కానీ ఇప్పుడు మహాకాళి లో విజువల్స్ చూసి మరోసారి ఆడియెన్స్ స్టన్ అవుతున్నారు. ముఖ్యంగా నటి శ్రేయ రెడ్డిపై ఆ లాస్ట్ ఫ్రేమ్ అయితే థియేటర్స్ లో మరోసారి ప్రశాంత్ వర్మ అండ్ టీం పూనకాలు రప్పించడం గ్యారెంటీ అన్నట్టుగా మారింది పరిస్థితి. సో ఈ ప్రాజెక్ట్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version