వైరల్ : ‘కళావతి’ తర్వాత “భీమ్లా” మాస్ సాంగ్ కి థమన్ క్రేజీ స్టెప్స్.!

Published on Feb 26, 2022 8:00 am IST

ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరో బిగ్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న లేటెస్ట్ చిత్రం “భీమ్లా నాయక్” హవా స్టార్ట్ అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దగ్గుబాటి రానా లు హీరోలుగా నటించిన ఈ చిత్రం నిన్న రిలీజ్ అయ్యి భారీ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుంది.

మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకోవడంతో మేకర్స్ ఆల్రెడీ సెలెబ్రేషన్స్ ని స్టార్ట్ చేసేసారు. ఇక ఈ సినిమాలో మరో బిగ్ ప్లస్ గా నిలిచిన సంగీత దర్శకుడు థమన్ ఎస్ అయితే గతంలో ఏ సినిమా సక్సెస్ కి కూడా చెయ్యని ఎంజాయ్మెంట్ భీమ్లా సక్సెస్ తో చేస్తున్నాడు.

తాను కంపోజ్ చేసిన భీమ్లా నాయక్ మాస్ సాంగ్ తన మ్యూజిక్ యూనిట్ తో కలిసి సూపర్ స్టెప్స్ చేస్తూ వైరల్ గా మారాడు. థమన్ ని అయితే ఈ రేంజ్ లో ఎంజాయ్ చేస్తూ డాన్స్ చెయ్యడం చూసి ఉండకపోవచ్చు. మరి రీసెంట్ గానే సూపర్ స్టార్ మహేష్ కి కంపోజ్ చేసిన కళావతికి కూడా స్టెప్స్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాని తర్వాత భీమ్లా కి ఇంకో రేంజ్ లో వైరల్ అవుతున్నాడు.

సంబంధిత సమాచారం :