మహేష్ తర్వాత పవన్ – రానా చిత్రం నుంచి కూడా సీన్ లీక్.!

Published on Jul 30, 2021 7:05 am IST


గత కొన్నాళ్ల నుంచి మన టాలీవుడ్ సినిమాలకు లీక్ ల బెడద ఎక్కువయ్యిపోతూ వస్తుంది. మరి ఇదంతా ఏ పర్పస్ మీద జరుగుతుందో కానీ మన స్టార్ హీరోల ప్రతీ సినిమా నుంచి కూడా ఆన్ లొకేషన్ ఫోటోల నుంచి వీడియోల వరకు కూడా నిరంతరం వచ్చేస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే పలు చిత్రాల సీన్స్ లీక్ అయ్యాయి. కొన్ని రోజులు కితమే సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా మోస్ట్ వాంటెడ్ చిత్రం “సర్కారు వారి పాట” నుంచి మహేష్ పేల్చిన డైలాగ్ సీన్ లీక్ కాగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దగ్గుబాటి రానా ల కాంబోలో వస్తున్న మాస్ రీమేక్ చిత్రం నుంచి కూడా ఒక వీడియో బిట్ లీక్ అయ్యింది.

అది కూడా సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. పవన్ మరియు రానా ల మధ్య పవర్ ఫుల్ కన్వర్జేషన్ ఇందులో కనిపించి లీక్ అయ్యింది. మరి ఇలా మన స్టార్ హీరోల సినిమాల నుంచి ఇంతలా లీక్స్ వస్తున్నా మేకర్స్ సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదా అన్న అనుమానాలు కలుగుతుతున్నాయి. ఈ లీక్స్ అన్నీ ఇప్పుడు ఎగ్జైట్మెంట్ లో అందరూ చూసేసి బాగా అనిపించినా తర్వాత మాత్రం అంత ఇంపాక్ట్ అనిపించవు. మరి వీటన్నింటికి ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందో చూడాలి..

సంబంధిత సమాచారం :