తెలుగు రాష్ట్రాల్లో “మేజర్” బాటలోనే “విక్రమ్” కూడా..!

Published on Jun 2, 2022 9:01 am IST


ఇటీవల టాలీవుడ్ లో టికెట్ ధరల పరంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూసాము. భారీ హైక్స్ తో ఓ సెక్షన్ ఆడియెన్స్ దూరం అవుతున్నారని గ్రహించి చిత్ర నిర్మాతలు తమ సినిమాలను ప్రేక్షకులకు సాధారణ రేట్స్ కే తీసుకొస్తున్నట్టు తెలిపారు. అయితే అది ఆల్రెడీ ఎఫ్ 3 తో స్టార్ట్ కాగా దీని తర్వాత రేపు రిలీజ్ అవుతున్న భారీ సినిమాల్లో యంగ్ హీరో అడివి శేష్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “మేజర్” ని ఏపీ మరియు తెలంగాణలో గరిష్టంగా మల్టీ ప్లెక్స్ లలో 200, 177 రూపాయల టికెట్స్ తో రిలీజ్ చేస్తున్నామని చాలా రీజనబుల్ రేట్ కి తమ సినిమాని అందిస్తున్నామని తెలిపారు.

ఇక ఇప్పుడు సేమ్ ఇదే ఫార్మాట్ లో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా ఫహాద్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, స్టార్ హీరో సూర్య లాంటి బిగ్ స్టార్స్ కలయికలో వస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ “విక్రమ్” కూడా వస్తుంది. మరి దీనిని కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో అంతే రీజనబుల్ రేట్స్ తో తీసుకొస్తున్నామని ప్రతి ఒక్కరు సినిమా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చెయ్యాలని విక్రమ్ టీమ్ కోరుకుంటున్నారు. మరి ఇది కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ కాబోతుండగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :