పవన్ ని కలిసాక ఈ టాలెంటెడ్ యంగ్ నటుడు ఎగ్జైటింగ్ రెస్పాన్స్.!

Published on May 7, 2022 2:00 pm IST

తెలుగు సినిమా దగ్గర భారీ క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. తనకి ఉన్న అపారమైన క్రేజ్ కోసం ఆడియెన్స్ కి గాని సినీ ప్రముఖులకు గాని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే టాలీవుడ్ సెలెబ్రేటిస్ లో కూడా పవన్ కి అభిమానులు అధికంగానే ఉంటారు.

మరి తాజాగా పవన్ ని కలిసిన ఓ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు తన ఎగ్జైటింగ్ రెస్పాన్స్ ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. పెళ్లి చూపులు, జాతి రత్నాలు సహా పలు వెబ్ సిరీస్ లలో తన నటనతో మెప్పించిన నటుడు ప్రియదర్శి తన సోషల్ మీడియాలో పవన్ ని కలిసాక ఇలా తెలిపాడు.

“ఎప్పటిలాగ సారధి స్టూడియోలో షూటింగకి వెళ్ళాను, కానీ ఆ రోజు మాత్రం ఎప్పటి లాగా లేదు. ఎటు చూసిన హడావిడి, అందరి కళ్ళలో ఏదో సందడి, అందరి నోట్లో ఒకటే మాట, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. అంతే! వారితో ఒక మాటైనా మాట్లాడాలి, వారు తీసిన చిత్రం “జానీ” ఎంతగా నచ్చిందో చెప్పడానికి రోజంతా ఎదురుచూశాను! హరీష్ శంకర్ అన్న వల్ల ఆ కోరిక తీరింది, నీకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్న! కళ్యాణ్ గార్ని కలిసి మాట్లాడడం ఒక మర్చిపోలేని అనుభూతి…” అంటూ తన ఆసక్తిని తెలియజేసి పవన్ తో ఫోటో దిగి ఆటో గ్రాఫ్ ని తీసుకున్నాడు. కాగా ఇపుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :