బాబాయ్ తర్వాత హిస్టారిక్ ఫీట్ పై చరణ్ స్పందన.!

Published on Oct 23, 2021 9:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ స్వామి ప్రస్తుతం ఐకానిక్ దర్శకుడు శంకర్ తో ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్ననే ఈ చిత్రం తాలూకా షూట్ పూణే లో స్టార్ట్ అయ్యింది. అయితే ఇదిలా ఉండగా రామ్ చరణ్ ఇటీవల భారత దేశ ప్రభుత్వం అందుకున్న ఒక హిస్టారికల్ మైలు రాయిపై తన అద్భుత స్పందనను వెల్లడి చేశారు. భారతదేశం 100 కోట్ల వాక్సినేషన్ ను విజయవంతంగా పూర్తి చేసుకొని “వాక్సినేషన్ సెంచరీ” అనే హిస్టారికల్ మూమెంట్ ని నమోదు చేసింది అని..

ఈ ఘనత అందుకోవడానికి అహర్నిశలు పని చేసిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ మెడికల్ టీం అందరికీ ప్రత్యేక కృతజ్ఞ్యతలు తెలియజేస్తున్నానని రామ్ చరణ్ తన సోషల్ మీడియా ద్వారా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇండియా వారిని కొనియాడారు. మరి ఈ చారిత్రాత్మిక ఘటనపై కొన్ని రోజులు కితమే చరణ్ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన స్పందనను తెలియజేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :