ప్రభాస్ తర్వాత మహేష్ పెదవిపై నవ్వు పూయించిన బాలయ్య.!

ప్రభాస్ తర్వాత మహేష్ పెదవిపై నవ్వు పూయించిన బాలయ్య.!

Published on Nov 16, 2022 8:30 PM IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఈ ఏడాదిలో తన జీవితంలో ఓ పెద్ద విషాదం. అయితే ప్రతి మనిషి జీవితంలో తమ ఆప్తులను కోల్పోవడం సహజమే కానీ మహేష్ బాబు విషయంలో ఈ ఏడాది జరిగిన ఘటనలు మాత్రం ప్రతి ఒక్కరికీ హృదయ విదారకంగా అనిపించాయి. మరి ఈ సమయంలోనే మహేష్ కి తోడుగా ధైర్యంగా మన టాలీవుడ్ ప్రముఖులు అంతా కూడా కృష్ణ గారిని కోల్పోయిన మహేష్ ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి పూనుకున్నారు.

మరి నిన్నటి నుంచి అంతటి విషాదంలో మహేష్ ని అలా ఎవరూ చూడలేకపోయారు. అలా చూసిన ప్రతి ఒక్కరికీ కూడా కళ్ళలో నీళ్లు చెమర్చాయి. అయితే ఈ సమయంలో ఇంత బాధలో కూడా ఎక్కడో చిన్న మానసిక సంతోషంలా మహేష్ పెదవిపై చిరునవ్వు చూడడం నిన్న ప్రభాస్ కలిసిన తర్వాత అభిమానులు చూడడం కాస్త ఉపశమనంలా అనిపించింది.

ఇక ఈరోజు అయితే నటసింహ బాలకృష్ణ మహేష్ ఇంటికి చేరి వారికి ధైర్యం చెప్పారు. అలాగే మహేష్ మరియు బాలయ్య లకు కూడా మంచి అనుబంధం ఉంది. దీనితో ఈ మీటింగులో మహేష్ ముఖంలో బాలయ్య మూలాన చిన్నగా చిరు నవ్వు చూడడం అనేది ఇప్పుడు వైరల్ గా మారింది. దీనితో అభిమానులు కూడా జరిగినది ఎలాగో తప్పదు అని ప్రస్తుతం కుదుటపడుతున్న మహేష్ ని చూసి వారు కూడా సముదాయించుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు