వైరల్..”ప్రాజెక్ట్ కే” తర్వాత ప్రభాస్ అన్నీ హాలీవుడ్ సినిమాలే..

Published on Jan 9, 2022 12:00 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తన కెరీర్ లోనే కాకుండా ఏ ఇండియన్ హీరో కూడా పెట్టుకోని సాలిడ్ లైనప్ లో ప్రభాస్ ఇప్పుడు బిజీగా ఉన్నారు. మరి వాటిలో పాన్ ఇండియన్ స్థాయి నుంచి పాన్ ఆసియన్, అలాగే వరల్డ్ లెవెల్ వరకు సినిమాలు ఉన్నాయి.

అయితే ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో చేస్తున్న బరువైన ప్రాజెక్ట్ మాత్రం యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న ప్రాజెక్ట్ “ప్రాజెక్ట్ కే”. ఈ సినిమా ఇండియాలోనే అత్యంత ఖరీదైన సినిమాగా దీనిని నిర్మాత అశ్వనీ దత్ నిర్మాణం వహిస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఆయన లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన సినిమా కోసం మరియు ప్రభాస్ కోసం చేసిన కామెంట్స్ ఓ రేంజ్ లో హైప్ తో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఏ ఇండియన్ హీరో కోసం హాలీవుడ్ మేకర్స్ వెతికి ఉండకపోవచ్చు కానీ ఈ ప్రాజెక్ట్ కే తర్వాత ప్రభాస్ కేవలం అన్నీ హాలీవుడ్ సినిమాలే చేస్తూ వెళ్లినా ఎలాంటి ఆశ్చర్యం లేదని చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు.

అంటే ఈ సబ్జెక్టును నాగ్ అశ్విన్ ఆ రేంజ్ లో డిజైన్ చేసాడని చెప్పుకొచ్చారు. మొత్తానికి మాత్రం ఈ కామెంట్స్ తర్వాత ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాలో అమితాబ్ మరియు దీపికా పదుకొనె లాంటి బిగ్ స్టార్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :