“పుష్ప” తర్వాత “శ్యామ్ సింగ రాయ్” షో చూసిన ఇండియన్ క్రికెటర్!

Published on Jan 21, 2022 9:00 am IST

గత ఏడాది అందులోని చివరి నెల డిసెంబర్ లో వచ్చిన సినిమాలు కలిగించిన ఇంపాక్ట్ మాత్రం గట్టిదే అని చెప్పాలి. బాలయ్య “అఖండ” నుంచి తర్వాత ఐకాన్ స్టార్ “పుష్ప” ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని చేసిన “శ్యామ్ సింగ రాయ్” ఇలా మూడు మూడు వారాల్లో బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.

మరి ఇదిలా ఉండగా వీటిలో పుష్ప సినిమాని మన ఇండియన్ క్రికెటర్ అలాగే తెలుగు వాడు అయిన హనుమా విహారి వీక్షించగా ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన శ్యామ్ సింగ రాయ్ సినిమా ని లేట్ నైట్ షో చూస్తున్నట్టు తెలిపాడు. ఆల్రెడీ పుష్ప చూసాక తన స్పందనను తెలిపాడు.

మరి ఇది చూసి తన రివ్యూ కూడా ఇస్తాడో లేదో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించగా సాయి పల్లవి మరియు కృతి శెట్టి లు హీరోయిన్స్ గా నటించారు. అలాగే మిక్కీ జే మేయర్ సంగీతం అందివ్వగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది.

సంబంధిత సమాచారం :