“వారియర్” లో రామ్ తో పాటు ఈ నటుడికి స్పెషల్ అప్లాజ్.!

Published on Jul 15, 2022 7:03 am IST


టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “ది వారియర్” ఈరోజే గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాని దర్శకుడు ఎన్ లింగుసామి తెరకెక్కించిన తెలుగు మరియు తమిళ్ లో ఏకకాలంలో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా కి మంచి టాక్ కూడా మాస్ నుంచి అందుతుండగా ఈ సినిమాలో ముఖ్యంగా రామ్ పెర్ఫామెన్స్ కోసం అంతా బాగా మాట్లాడుతున్నారు.

ఇంకా రామ్ తో పాటుగా అయితే మరో నటుడు ఈ సినిమాలో విలన్ గా చేసిన ఆదికి స్పెషల్ అప్లాజ్ దక్కుతుండడం విశేషం. చాలా కాలం తర్వాత ఆది విలన్ గా చేయగా తన రోల్ ని ఓ రేంజ్ లో చేసాడని అంటున్నారు. ఆ రోల్ లో తన లుక్స్ తో పాటుగా ఆ మాసివ్ నెస్ ని ఆది అదిరేలా చూపించాడని మూవీ లవర్స్ రామ్ తో పాటుగా ఆది పినిశెట్టి నటనకి కూడా ఫిదా అయ్యిపోయారు.

సంబంధిత సమాచారం :