“భీమ్లా నాయక్” నుంచి కూడా అప్డేట్ రాబోతోందా?

Published on Dec 3, 2021 12:29 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ మల్టీ స్టారర్ మాస్ మూవీ “భీమ్లా నాయక్”. మాస్ ఆడియెన్స్ లో మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి కూడా ఇటీవల రావాల్సిన ఓ అప్డేట్ పలు కారణాల చేత వాయిదా పడింది. అదే ఈ సినిమా నుంచి కొత్త సాంగ్. “అడవి తల్లి మాట” అంటూ సాగే ఈ సాంగ్ పై మంచి బజ్ ని ఈ సాంగ్ సంతరించుకుంది.

అయితే అప్పుడు వాయిదా పడింది అని చెప్పిన మేకర్స్ మళ్ళీ దీనిపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీనితో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ అప్డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది. ఇంకో పక్క “RRR” ట్రైలర్ డేట్ కోసం కూడా అంతా ఎదురు చూస్తున్నారు. మరి ఈ రెండు అప్డేట్స్ ఈరోజు వస్తాయా రేపు వస్తాయా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :