“RRR” తర్వాత హాట్ టాపిక్ గా మిస్టర్ బాక్సాఫీస్ రెమ్యునరేషన్!

“RRR” తర్వాత హాట్ టాపిక్ గా మిస్టర్ బాక్సాఫీస్ రెమ్యునరేషన్!

Published on Dec 26, 2021 1:00 PM IST

ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమా అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా “రౌద్రం రణం రుధిరం”. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత పాన్ ఇండియన్ మార్కెట్ లో డెఫినెట్ గా మంచి ఇంపాక్ట్ ని నమోదు చేసే హీరోలుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు మారిపోనున్నారు ఇది కూడా తెలుసు.

అయితే వీరిలో మిస్టర్ బాక్సాఫీస్ రామ్ చరణ్ కి మాత్రం కాస్త స్పెషల్ అని చెప్పాలి. తన నెక్స్ట్ సినిమాలు లైనప్ కానీ పాన్ ఇండియన్ వైడ్ ఇపుడు తనకి ఉన్న పాపులారిటీ కానీ భారీ లెవెల్లోనే ఉన్నాయి. ఓ రకంగా సరైన ప్లానింగ్ ఉంటే ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా మార్కెట్ తనకి కూడా మంచి ముద్ర వేయడానికి ముందు వరుసలో ఉంటాడనిపిస్తుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా తర్వాత రామ్ చరణ్ రెమ్యునరేషన్ పై హాట్ బజ్ ఇప్పుడు నడుస్తుంది. RRR తర్వాత నుంచి తన సినిమాలకి గాను భారీ స్థాయిలో 100 కోట్ల మేర రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నాడని ఓ టాక్ వైరల్ అవుతుంది. ఇందులో ఎంతమేర నిజముందో కానీ సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో రామ్ చరణ్ రెమ్యునరేషన్ కోసమే చర్చ.

మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రెజెంట్ చరణ్ చేస్తున్న శంకర్ తో ప్రాజెక్ట్ కి ఆ తర్వాత గౌతమ్ తో ప్రాజెక్ట్ కి కూడా చరణ్ ఈ మొత్తం అందుకుంటున్నాడని ఇందులో సారాంశం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు