“RRR” తర్వాత ఆసక్తిగా మారుతున్న మిస్టర్ బాక్సాఫీస్ డిఫరెంట్ లుక్స్.!

“RRR” తర్వాత ఆసక్తిగా మారుతున్న మిస్టర్ బాక్సాఫీస్ డిఫరెంట్ లుక్స్.!

Published on May 29, 2022 7:43 PM IST


మెగాపవర్ స్టార్ మిస్టర్ బాక్సాఫీస్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ మరియు శంకర్ ల కెరీర్ లో బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ 15వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ స్థాయి హైప్ ఉంది.

అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్స్ పరంగా మాత్రం శంకర్ తీసుకుంటున్న కేర్ ఎప్పటికపుడు ఆశ్చర్యపరుస్తుంది. సినిమా షూటింగ్ స్టార్టింగ్ టైం లో ఒక లుక్ తర్వాత సాంగ్ షూట్ టైం లో ఒక లుక్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ షూటింగ్ టైం లో ఒక లుక్ ఇప్పుడు రీసెంట్ గా బయటకొచ్చిన ఫొటోస్ లో ఒక సరికొత్త లుక్ లో రామ్ చరణ్ కనిపిస్తున్నాడు.

బహుశా RRR తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో డిఫరెంట్ లుక్స్ ని చరణ్ కనబరుస్తున్నాడు. అయితే వీటిలో దేనితో కూడా చరణ్ అభిమానులు ఎక్కడా డిజప్పాయింట్ కాకపోవడం విశేషం. మరి ఫుల్ లెంగ్త్ సినిమాలో శంకర్ అయితే ఎలాంటి ట్రీట్ ఇచ్చి ఉంటారో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు