“సర్కారు వారి” సక్సెస్ తర్వాత ఫ్యామిలీ వెకేషన్ లో మహేష్.!

Published on May 22, 2022 12:00 pm IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” రీసెంట్ గా రిలీజ్ అయ్యి మహేష్ కెరీర్ లో ఒక మంచి హిట్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ సాలిడ్ మాస్ అండ్ సోషల్ డ్రామా ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లను సాధిస్తుంది.

ఇక ఇదిలా ఉండగా మహేష్ తన ప్రతి సినిమా తర్వాత కూడా తన కుటుంబంతో కలిసి వెకేషన్ కి వెళ్లారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాగే తన కుటుంబంతో కలిసి వెకేషన్ కి పయనం అయ్యారు. లేటెస్ట్ ఆ విజువల్స్ కూడా బయటకొచ్చి మంచి వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వెకేషన్ తర్వాత మహేష్ అయితే తన హ్యాట్రిక్ దర్శకుడు త్రివిక్రమ్ తో భారీ పాన్ ఇండియా సినిమాని ఈ జూలై నుంచి స్టార్ట్ చెయ్యనున్నాడు.

సంబంధిత సమాచారం :