శంకర్ తర్వాత చరణ్ లైనప్ లో ఈ డైరెక్టర్ ఫిక్స్.?

Published on Sep 5, 2021 8:02 pm IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. మరి వీటి తర్వాత సిసలైన ప్రాజెక్ట్ శంకర్ తో ప్లాన్ చేసింది స్టార్ట్ కావాల్సి ఉంది. అయితే ఈ చిత్రం వచ్చే సెప్టెంబర్ 8న ముహూర్తం ఫిక్స్ చేసుకోగా ఆ హైప్ ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది.

అయితే “RRR” సినిమా తర్వాత చరణ్ లైనప్ పై ఆసక్తి కూడా నెలకొంది. ఎవరెవరితో చేస్తారు అన్న సమయంలో దిల్ రాజు శంకర్ తో సెటప్ చేసి ఒక్కసారిగా ఎనలేని హైప్ తీసుకొచ్చారు. మరి శంకర్ తర్వాత ఏ దర్శకునితో అంటే టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పేరునే వినిపిస్తుంది.

ఇది వరకే వీరి కాంబోపై బజ్ ఉంది. మరి ఇంకా ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లోనే ఉన్నట్టుగా నయా టాక్స్. అయితే గౌతమ్ తిన్ననూరి క్యాలిబర్ ఏంటో టాలీవుడ్ ఆడియెన్స్ కి బాగా అర్ధం అయ్యింది. అందుకే ఈ సినిమా పట్ల కాస్త ప్రత్యేక అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎప్పుడు మెటీరిలైజ్ అవుతుందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :