ఎన్నో ఏళ్ల తర్వాత అక్కడ రిలీజ్ కాబోతున్న హిందీ సినిమాగా “పఠాన్”.!

Published on May 5, 2023 7:03 pm IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ బాలీవుడ్ బ్లాస్ట్ హిట్ చిత్రం “పఠాన్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ వచ్చి ఈ చిత్రం బాలీవుడ్ హిస్టరీ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి షారుఖ్ ఖాన్ అసలు స్టామినా ఏంటో చూపించింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అయితే అనేక దేశాల్లో రిలీజ్ అయ్యింది.

అన్ని దేశాల్లో కూడా ఆల్ టైం రికార్డు వసూళ్లు అందుకొని ఈ చిత్రం బాలీవుడ్ బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా అయితే నిలిచింది. అయితే ఇపుడు ఈ చిత్రం మరో దేశంలో అందులోని దాదాపు ఎన్నో ఏళ్ళు నుంచి హిందీ సినిమా రిలీజ్ కాని దేశంలో రిలీజ్ అవుతుందట. ఇంకెక్కడో కూడా కూడా మన దేశానికి పక్క దేశం అయినటువంటి బంగ్లాదేశ్ లో అట.

అక్కడ దాదాపు 2009 లో బాలీవుడ్ నుంచి “వాంటెడ్” చిత్రం రిలీజ్ అయ్యిందట. అక్కడ నుంచి మళ్ళీ మరో హిందీ సినిమా ఆ దేశంలో రిలీజ్ కాలేదట. కానీ ఫైనల్ గా ఇప్పుడు పఠాన్ ఈ మే 12న అక్కడ రిలీజ్ కాబోతుందట. ఇక అక్కడ ఎలాంటి వసూళ్లు ఈ చిత్రం రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :