“స్క్విడ్ గేమ్” సక్సెస్ తో ఆ సిరీస్ లపై నెట్ ఫ్లిక్స్ భారీ పెట్టుబడులు!

Published on Jan 19, 2022 10:04 am IST


ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులర్ అయ్యినటువంటి ప్రముఖ స్త్రీమింగ్ సంస్థల్లో “నెట్ ఫ్లిక్స్” కూడా ఒకటి. వీరి దగ్గర దొరికే క్వాలిటీ కంటెంట్ గాని అంత ఎక్కువ స్థాయి వెబ్ కంటెంట్ గాని మరెవరి దగ్గర కూడా ఉండదని చెప్పడంలో కూడా సందేహం లేదు. అయితే ఇందులో ఇప్పటి వరకు ఎన్నో హిట్ వెబ్ సిరీస్ లు వచ్చాయి. మరి ఇటీవల అయితే ఆన్లైన్ సెన్సేషన్ “స్క్విడ్ గేమ్” వారి సంస్థలో ఒక కొత్త ట్రెండ్ ని సృష్టించింది.

ప్రపంచ వ్యాప్తంగా రికార్డు బ్రేకింగ్ వ్యూస్ తో నుంబర్ నెంబర్ 1 షో గా నిలిచింది. అయితే ఈ సిరీస్ ఒరిజినల్ గా కొరియన్ భాషకి సంబంధించింది అని అందరికీ తెలిసిందే. మరి వీరి నుంచి దీనితో పాటుగా మరింత కంటెంట్ కి బాగా క్రేజ్ ఉంది. మరి అందుకే నెట్ ఫ్లిక్స్ వారు ఇప్పుడు కొరియన్ కంటెంట్ పై మరింత దృష్టి పెట్టారట.

అందులో భాగంగానే ఏకంగా 25 కొత్త వెబ్ సిరీస్ లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. మరి అందుకు గాను భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఒక్క ఈ కొరియన్ షోస్ కోసమే నెట్ ఫ్లిక్స్ వారు ఏకంగా 500 మిలియన్ డాలర్స్ కి పైగా పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయ్యారట.. అంటే ఇక ముందు రోజుల్లో నెట్ ఫ్లిక్స్ నుంచి ఎలాంటి కంటెంట్ ఓటిటి లవర్స్ కి రానుందో మనం ఊహించవచ్చు.

సంబంధిత సమాచారం :