‘శ్రీ వల్లి’ సాంగ్ తో మాత్రం ఇంకొకటి కూడా బాగా అర్ధం అవుతుంది!

Published on Oct 14, 2021 8:13 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ అలాగే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. అసలు ఈ ముగ్గురు కాంబోని డెడ్లీ కాంబినేషన్ అనేకన్నా మ్యాజికల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. వీరి నుంచి వచ్చిన “ఆర్య” సిరీస్ కానీ పాటలు కానీ ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్. మరి లేటెస్ట్ గా వీరి నుంచి వస్తున్న ఫస్ట్ ఎవర్ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప” పై అయితే పీక్స్ లో అంచనాలు ఉన్నాయి.

దీనితో ఈ సినిమా ఆల్బమ్ ఎలా ఉంటుందా అని ముందు నుంచీ ప్రతీ ఒక్కరిలో ఎంతో ఉత్సుకత నెలకొంది. అలా ఆల్రెడీ ఓ మాస్ సాంగ్ చార్ట్ బస్టర్ కాగా నిన్న వచ్చిన “శ్రీ వల్లి” అయితే మ్యాజిక్ చేస్తుంది అని చెప్పాలి. ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాట ఇది. దీనితో ఈ సాంగ్ కి ఇప్పుడు భారీ రెస్పాన్స్ దక్కింది. అయితే ఈ సాంగ్ తో మాత్రం ఇంకో విషయం బాగా అర్ధం అవుతుందని అని చెప్పాలి.

ఈ సినిమాలో ఎంతైతే ఇంటెన్స్ యాక్షన్ కనిపిస్తుందో అంతే అందంగా పుష్ప రాజ్ మరియు శ్రీవల్లి ల మధ్య లవ్ స్టోరీ కూడా అనిపిస్తుంది. అలాగే పుష్ప రాజ్ పాత్ర కూడా ఓ పక్క స్మగ్లర్ లా ఎంత కటువుగా కనిపించినా తన శ్రీవల్లి విషయంలో ఎంతో మంచి ప్రేమికుడులా కనిపిస్తాడు.

ఇక అక్కడ నుంచి ఈ ఇద్దరు ఎలాంటి టర్న్ తీసుకుంటారు అన్నది కూడా కీలకంగా అనిపిస్తుంది. మొత్తానికి మాత్రం సుకుమార్ మ్యాజిక్ ఈ సినిమాతో మళ్ళీ రిపీట్ చెయ్యడం గ్యారంటీ అనిపిస్తుంది. అదెలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే డిసెంబర్ 17 వరకు ఆగాల్సిందే మరి.

సంబంధిత సమాచారం :