“సూర్య 42” తర్వాత ఒకేసారి రెండు సినిమాలు?

Published on Mar 9, 2023 11:30 pm IST


ప్రస్తుతం కోలీవుడ్ సినిమా నుంచి మంచి మోస్ట్ అవైటెడ్ మరియు భారీ అంచనాలు ఉన్న పాన్ ఇండియా సినిమాగా దర్శకుడు శివ తో స్టార్ హీరో సూర్య చేస్తున్న లేటెస్ట్ సినిమా నిలిచింది. రికార్డు మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ ని లాక్ చేసుకున్న ఈ సినిమా అందుకు తగ్గ రేంజ్ లోనే షూటింగ్ జరుపుతూ ఉండగా సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్ లకి సంబంధించి అయితే మరింత ఆసక్తి నెలకొంది.

అయితే సూర్య తన కెరీర్ లో మంచి హిట్ ఇచ్చిన దర్శకురాలు సుధా కొంగర తో మళ్ళీ ఓ సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కాంబో సూర్య 42 తర్వాతే స్టార్ట్ కానున్నట్టుగా తెలుస్తుంది. అంతే కాకుండా మరో సాలిడ్ ప్రాజెక్ట్ సూర్య ఆల్రెడీ మొదలు పెట్టి ఆపిన సినిమా “వాడి వాశల్” కూడా దీని తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఒకే సమయంలో సూర్య ఈ రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లను స్టార్ట్ చేయనున్నాడని టాక్. మొత్తానికి అయితే సూర్య నుంచి ఫ్యాన్స్ అదిరే ట్రీట్ లు రానున్న రోజుల్లో ఉంటాయని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం :