ఇంటర్వ్యూ : కారుణ్య చౌదరి – ఈ సినిమా తర్వాత అందరూ నన్ను సీతగానే గుర్తుపెట్టుకుంటారు !

నటి కారుణ్య చౌదరి హీరోయిన్ గా చేసిన తాజా చిత్రం ‘సీత రాముని కోసం’. ఈ నెల 15న సినిమా రిలీజవుతున్న సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ఈ సినిమా గురించి చెప్పండి ?
జ) నేను ఇంతకు ముందు కూడా కొన్ని సినిమాలు చేశాను. కానీ వాటితో ప్రేక్షకులకి పెద్దగా రీచ్ కాలేకపోయాను. కానీ ఈ సినిమాతో మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకులకి దగ్గరవుతాననే నమ్మకం నాకుంది. అందుకే ఇదే నా డెబ్యూ మూవీ అని చెప్పుకుంటాను. ఇదొక ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్.

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఈ సినిమాలో నా పాత్ర పేరు సీత. డైరెక్టర్ అనిల్ చాలా ఇష్టంగా క్రియేట్ చేసుకున్న పాత్ర అది. ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది. బాపు సినిమాల్లో హీరోయిన్స్ ఎలా ఉంటారో అలానే ఉంటుంది.

ప్ర) టీజర్, ట్రైలర్స్ కు ఎలాంటి స్పందన వస్తోంది ?
జ) చూసిన ప్రతి ఒక్కరు నేరుగా కాల్ చేసి కంగ్రాట్స్ చెబుతున్నారు. ముఖ్యంగా లాలీ పాటకు రెస్పాన్స్ సూపర్ గా ఉంది.

ప్ర) ఈ సినిమా మీకు ఖచ్చితంగా బ్రేక్ ఇస్తుందని అనుకుంటున్నారా ?
జ) ఈ సినిమా తర్వాత నన్ను అందరూ సీత కారుణ్యగానే గుర్తుపెట్టుకుంటారు. సెట్స్ లో కూడా అందరూ నన్ను సీత అనే పిలుస్తున్నారు. అంతా సౌందర్యలా చేశావని అంటున్నారు.ఆ కాంప్లిమెంట్స్ వింటే చాలా హ్యాపీగా అనిపించేది.

ప్ర) ఈ సినిమాలో హర్రర్ కంటెంట్ ఉంటుందా ?
జ) అలాంటిదేం లేదు. ఫ్యామిలీ అంతా కలిసి చూడగలిగే ఎమోషనల్ థ్రిల్లర్. సినిమా అయిపొయాక అందరూ ఒక మంచి సినిమా చూశాం అనే భావనతో బయటికొస్తారు.

ప్ర) డైరెక్టర్ అనిల్ వర్క్ ఎలా ఉంది ?
జ) అనిల్ చాలా కూల్. ఆయనకి ఏం కావాలో అడిగి మరీ చేయించుకున్నారు. మేము సరిగా చేయలేకపోతే ఓపిగ్గా అన్నీ వివరించి చెప్పేవారు. షూటింగ్ మొత్తం చాలా ప్లెజెంట్ గా సాగిపోయింది.

ప్ర) హీరో శరత్ తో పనిచేయడం ఎలా అనిపించింది ?
జ) హీరో శరత్ కి ఇది ఫస్ట్ సినిమా. కానీ ఆయన మొదటి సినిమాలా కాకుండా చాలా బాగా చేశారు.

ప్ర) వేరే ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయా ?
జ) కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఈ సినిమా రిజల్ట్ ను బట్టి తర్వాత సినిమాలు చేస్తాను. నాకైతే ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ రోల్స్ చేయాలనుంది.