వంశీ తర్వాత సక్సెస్ అయ్యిన వెంకీ.!

Published on Feb 18, 2023 1:00 am IST


ప్రస్తుతం అన్ని సినీ ఇండస్ట్రీ లు కలిపి ఒకటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీగా మారిపోయాయి అని చెప్పాలి. టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ అని లేకుండా అన్ని భాషల సినిమాలు కూడా అన్ని ఇతర భాషల్లో సత్తా చాటుతున్నాయి. అలాగే ఇతర భాషలకి చెందిన దర్శకులు హీరోలు మరియు దర్శకులు ఇతరులతో వర్క్ చేసి సూపర్ సక్సెస్ లు అయితే అందుకుంటున్నారు.

అలా రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి వెళ్లిన దర్శకులు కోలీవుడ్ లో కూడా సత్తా చాటారని చెప్పాలి. మొదటగా ఈ ఏడాదిలో వచ్చిన సినిమా “వారిసు” తో అయితే తమిళ్ లో దర్శకుడు వంశీ పైడిపల్లి భారీ సక్సెస్ ని అందుకోగా ఇపుడు తన తర్వాత ధనుష్ తో వర్క్ చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి కూడా హిట్ ఇచ్చి తమిళ్ లో సక్సెస్ అందుకున్న టాలీవుడ్ దర్శకుడిగా నిలిచాడు.

ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు దర్శకులు మంచి విజయాలు అందుకొని అక్కడి ఆడియెన్స్ ని కూడా అమితంగా అలరించారని చెప్పాలి. ఇక ముందు కూడా వీరి నుంచి మరిన్ని ఇలాంటి సినిమాలు ఆడియెన్స్ ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం :