క్రేజీ బజ్: ‘వారణాసి’ తర్వాత మహేష్ పర్ఫెక్ట్ ప్లానింగ్!

Mahesh-Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు లోకల్ నుంచి పాన్ ఇండియా కాకుండా డైరెక్ట్ గా పాన్ వరల్డ్ లెవెల్ మార్కెట్ మరియు ఆడియెన్స్ ని తన భారీ సినిమా వారణాసి తో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేస్తున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. ఇక ఇలాంటి సినిమా తర్వాత మహేష్ నుంచి నెక్స్ట్ సినిమా ఏంటి?

ఇలాంటి గ్లోబల్ ఫినామినా తర్వాత దానిని మ్యాచ్ చేయగలిగే కాంబినేషన్ ని సెట్ చేయడం అనేదే పెద్ద సవాలు. అయితే దీనికి సమాధానంగా మహేష్ కూడా ఊహించని ప్లానింగ్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ దాదాపు సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తోనే ఉంటుంది అని క్రేజీ బజ్ వినిపిస్తోంది. వారణాసి లాంటి సినిమా తర్వాత ఆ వెయిట్ ని క్యారీ చేయాలి అంటే డెఫినెట్ గా ఈ కలయిక వల్లే అవుతుంది. సో మహేష్ ప్లానింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉందని చెప్పాల్సిందే. అలాగే దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Exit mobile version