చిట్ చాట్ : కృష్ణ వంశీ – నా సినిమా చూశాకా ప్రేక్షకుడికి ఒక మంచి ఫీల్ రావాలి.


ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ తాజాగా చేస్తునం చిత్రం ‘నక్షత్రం’. చాన్నళ్ల నుండి నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం అన్ని పనులను పూర్తి చేసుకుని జూన్ మొదటి వారంలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్బంగా కృష్ణ వంశీ అండ్ టీమ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం.

ప్ర) కృష్ణవంశీగారు ఈ సినిమా విడుదలయ్యాక వివాదాలేమైనా ఉంటాయా ?
జ) సినిమా విడుదలయ్యాక ఎలాంటి వివాదాలు రావు. కేవలం అభినందనలు మాత్రమే వస్తాయి.

ప్ర) మేకింగ్, ఎడిటింగ్ ఈ రెండింటిలో ఎందులో ఎక్కువ కష్టపడతారా ?
జ) ఒకదాంట్లో అనేం లేదు. సినిమా మొదలైన దగ్గర్నుంచి రైటింగ్, మేకింగ్, ఎడిటింగ్, మార్కెటింగ్ అన్ని విభాగాల్లో కష్టపడతాను.

ప్ర) కృష్ణ వంశీగారు ధరమ్ తేజ్ పాత్ర గురించి చెప్పండి ?
జ) అతను చేసింది ఒక క్యారెక్టర్ అని మాత్రమే అంటాం గాని అందులో ఒక హీరోకున్నంత స్కోప్ ఉంది. సినిమా మొత్తం అతని పాత్ర చుట్టూ తిరుగుతుంది. చాలా ముఖ్యమైన పాత్ర. ఫస్టాఫ్లో కనిపించడు గాని సినిమా అంతా అతని చుట్టూనే తిరుగుతుంది.

ప్ర) సందీప్ కిషన్ గారు కృష్ణ వంశీగారితో వర్క్ ఎలా ఉంది ?
జ) కృష్ణవంశీగారు బయట ఫ్రెండ్లీగా ఉంటారు. ఆన్ సెట్స్ లో మాత్రం ఒక గురువులా ఉంటారు. మాలాంటి యంగ్ యాక్టర్స్ కి నేర్పించే గురువు ఒకరు కావాలి. ఆయన నుండి మేం చాలా నేర్చుకున్నాం.

ప్ర) ‘నక్షత్రం’ తర్వాత మీలో ఎలాంటి తేడా వచ్చింది ?
జ) ఈ సినిమా వలన ఒక నటుడిగా కన్నా ఒక మనిషిగా నాలో చాలా మార్పొచ్చింది. నటుడిగా నాలో కొత్త సందీప్ కిషన్ ని చూస్తారు. అంతకన్నా వ్యక్తిగా ఇంకా కొత్తగా కనిపిస్తాను.

ప్ర) ఈ సినిమా చూశాక ఆడియన్స్ ఎలా ఫీలవుతారు ?
జ) ఈ సినిమా చూసి బయటికొచ్చాక ముందు ద్రం తేజ్ గురించి, తర్వాత తనీష్ గురించి, ఆ తర్వాత నా గురించి మాట్లాడుకుంటారు. మా పాత్రల్ని అలా డిజైన్ చేశారు కృష్ణ వంశీగారు.

ప్ర) సీరియస్ సబ్జెక్ట్ ను ఇలాంటి యంగ్ ఆర్టిస్టులతో చేయడం ఎలా ఉంది ?
జ) అంటే ఇపుడున్న నటుల్లో నా కథకు వీళ్లయితే సూట్ అవుతారని అనుకున్నాను కాబట్టి వీళ్ళతో చేశాను. అంతేగాని ఖచ్చితంగా వీళ్ళే చేయాలనేం లేదు. వీళ్ళలా ఎవరు సూటైతే వాళ్లతో చేసేవాడిని. అదంతా స్క్రిప్ట్ మీదే ఆధారపడి ఉంటుంది.

ప్ర) సినిమాలో ఎంటర్టైన్మెంట్ అంశాలు ఇంకేమున్నాయ్ ?
జ) ఇందులో సబ్జెక్ట్ కాకుండా 6 పాటలు, 14 నుండి 15 వరకు హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. అవన్నీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి.

ప్ర) మీరు రిస్క్ ఉండే సబ్జెక్ట్స్ ఎక్కువ చేస్తారు.. రిస్క్ లేని సబ్జక్ట్స్ ఎందుకు చేయరు ?
జ) నాకు రిస్క్ అంటే ఏంటో తెలీదు. కొందరు ఎలాగైనా సినిమా చేయాలని అనుకుంటారు. కొందరు ఇలాగే చేయాలి అనుకుంటారు. ఇలాగే చేయాలి అనుకునే వాళ్లలో ఇక కమిట్మెంట్, ఒక పర్పస్ ఉంటాయి. సినిమా చూసి బయటికొచ్చాక ఆడియన్ కి ఒక మంచి ఫీల్ రావాలి. మురారి సినిమా తర్వాత పెళ్లిళ్ల స్ట్రక్చర్ మారిపోయింది. సినిమా అంటే అలాంటి మంచి ఫీల్ కలిగించాలి.