“రాధే శ్యామ్” కి మరోసారి భారీ ఓటిటి ఆఫర్.?

Published on Jan 4, 2022 8:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రాధే శ్యామ్” ఇంకా రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు రాధ కృష్ణ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియన్ సినిమా వచ్చే జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి రెడీగా ఉండగా పలు అనుమానాలు మాత్రం ఇంకా అలానే ఉన్నాయి.

అనుకున్న టైం కి సినిమా రిలీజ్ అవ్వొచ్చు లేకపోవచ్చు అని ఊహాగానాలు వైరల్ అవుతుండగా మళ్ళీ ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓటిటి రిలీజ్ పై రూమర్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.. ఆ మధ్య లాక్ డౌన్ టైం లోనే ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సంబంధించి టాక్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చిన టాక్ లో మాత్రం ఎలాంటి సంబంధం లేదని తెలుస్తుంది.

ఆల్రెడీ ఈ సినిమా ఓటిటి స్త్రీమింగ్ పార్ట్నర్ గా జీ 5 వారు లాక్ అయ్యిన సంగతి అందరికీ తెలుసు. పైగా ఇక ఈ సినిమాని ఎట్టి పరిస్థితిలోను థియేటర్స్ లోనే రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ఫిక్స్ దీని బట్టి ఈ సినిమాకి వచ్చిన 400, 500 కోట్ల ఆఫర్స్ అంటూ స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని అంతా తెలుసుకోవాలి.

సంబంధిత సమాచారం :