బజ్..డైలమాలో “ఆచార్య” మేకర్స్.?

Published on Jan 11, 2022 1:36 pm IST


మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ కాంబోలో తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో చాలా ఆసక్తిగా ఈ భారీ మల్టీ స్టారర్ ఎట్టకేలకు అనేక డేట్స్ మధ్య ఫిబ్రవరి నెలకి ఫిక్స్ అయ్యింది.

మరి ఇదిలా ఉండగా ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు మారిపోతుండడంతో అనేక సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే టాలీవుడ్ లో జనవరి సినిమాలు ఆల్రెడీ వాయిదా పడగా ఇక ఫిబ్రవరి నెలలో సినిమాలు అయినా విడుదల అవుతాయా లేదా అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అయితే ఈ క్రమంలో “ఆచార్య” సినిమా ప్రస్తుత పరిస్థితులు రీత్యా ఈ రేస్ నుంచి తప్పుకోనున్నట్టుగా తెలుస్తుంది. మేకర్స్ మళ్ళీ రిలీజ్ ని వాయిదా వేయాలనే డైలమాలో ఉన్నారట. కరోనా మరియు ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి దీనిపై ఏమన్నా అధికారిక ప్రకటన వస్తుందో లేదో అనేది.

సంబంధిత సమాచారం :