మరోసారి “అఖండ” మాస్ జాతర సిద్ధం అవుతుంది గెట్ రెడీ.!

Published on Apr 2, 2022 11:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం “అఖండ”. గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అవ్వడమే కాకుండా బాలయ్య కెరీర్ లోనే భారీ వసూళ్లు అందుకున్న ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

మరి ఈ సినిమా దాదాపు 50 రోజుల పాటు హవా కొనసాగించి చాలా కాలంగా ఏ తెలుగు సినిమా కూడా అందుకొని ఫీట్ సాధించింది. ఇక ఈ తర్వాత ఓటిటి లో కూడా వచ్చి రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్ తో అదరగొట్టింది. ఇక ఇప్పుడు ఫైనల్ గా తెలుగు బుల్లితెరపై మరోసారి మాస్ జాతర చూపించేందుకు సిద్ధం అవుతుంది.

ప్రముఖ ఛానెల్ స్టార్ మా లో ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం అయ్యేందుకు అతి త్వరలో వస్తున్నట్టు ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. మరి ఇంకా దీనికి డేట్ మరియు టైం ఫిక్స్ అవ్వాల్సి ఉంది. మరి బుల్లితెరపై అఖండ ఎలాంటి రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :