మళ్ళీ “RRR” బ్లాస్ట్స్ కి సర్వం సిద్ధం..!

Published on Feb 23, 2022 7:02 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ మరియు భారీ పాన్ ఇండియా సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ గ్రాండ్ విజువల్ వండర్ పై అనేక అంచనాలు ఇప్పుడు నెలకొన్నాయి.

మరి ఇంకా ఇంకొక నెలలో రిలీజ్ కి వస్తున్న ఈ సినిమాపై మళ్ళీ కొత్త అప్డేట్స్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ కూడా ఆ పనుల్లోనే బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే భారీ లెవెల్లో దుబాయ్ ఈవెంట్ ని మేకర్స్ ప్లాన్ చేస్తుండగా ఈ ప్రమోషన్స్ మరియు ఈవెంట్ అన్నీ మార్చ్ మొదటి వారం నుంచి స్టార్ట్ చెయ్యనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. సో మళ్ళీ ఈ భారీ సినిమా నుంచి బ్లాస్టింగ్ అప్డేట్స్ ఒక్కొక్కటిగా రానున్నాయని చెప్పాలి.

సంబంధిత సమాచారం :