ఒక్క రోజులో భారీగా కేసులు..మరలా కలవరంలో సినిమా.!

Published on Jan 6, 2022 10:00 am IST


ప్రపంచంలోకి కరోనా ఎంటర్ అయ్యాక మళ్ళీ అలాంటి రోజులు రాకూడదు అని ప్రతి మనిషి ఎంతో కోరుకుంటున్నాడు. కేవలం ఇప్పటి వరకు ఇళ్లలోనే ఉండి ఇప్పటి వరకు బ్రతికి ఉన్న వారు అనుకుంటే ప్రాణ నష్టాన్ని చూసిన కుటుంబాల పరిస్థితి ఇంకా దారుణం. అందుకే మళ్ళీ ఈ కరోనా వల్ల ఎలాంటి నష్టం జరగకూడదని ఆశించినా ఇది మాత్రం అప్పుడే ఆగేలా కనిపించడం లేదు.

ఫస్ట్ వేవ్ అయ్యింది సెకండ్ వేవ్ అయ్యింది ఇప్పుడు మూడో వేవ్ దూసుకొస్తుంది. కొత్త ఏడాది కొత్త ఉత్సాహం అనుకుంటే భారీ ఎత్తున కొత్త కేసులు ఇప్పుడు వస్తున్నాయి. దీనితో అధికంగా నష్టాలు చూసేది మాత్రం ప్రపంచ వ్యాప్త సినిమా వాటిని నమ్ముకున్న థియేటర్స్ వ్యవస్థే అని చెప్పాలి. ఇక మన దేశంలో అయితే లేటెస్ట్ గా రికార్డు నెంబర్ ఒక్క రోజులోనే 90 వేల కేసుల మార్క్ ని టచ్ చేసింది.

దీనితో ఇండియన్ సినిమా దగ్గర మళ్ళీ కలవరం స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ పలు భారీ సినిమాలు ఆగిపోయాయి. ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలు కూడా వాటిలో ఉన్నాయి. అలాగే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు ఆల్రెడీ ఆగిపోయాయి. ఇప్పుడు ఇంత వేగంగా వ్యాప్తి జరుగుతుంది.

మళ్ళీ ఇది ఎప్పుడు ఆగుతుందో తగ్గుముఖం పడుతుందో కూడా అర్ధం కాని పరిస్థితి దీనితో మళ్ళీ అనేక సినిమాల రిలీజ్ లు ప్రశ్నార్ధకం? ఇంకా అవి ఎంత ముందుకు జరిగాయో అర్ధం కానీ పరిస్థితి. మరి రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. మరి ఇక నుంచి అయినా అంతా మళ్ళీ జాగ్రత్తలు పాటించి మాస్కులు, వాక్సిన్ లు విషయంలో అశ్రద్ధ వహించకుండా ఉంటే మంచిది.

సంబంధిత సమాచారం :