మరోసారి “పుష్ప రాజ్” గా అదరగొట్టేసిన డేవిడ్ వార్నర్.!

Published on Jan 21, 2022 7:37 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన లేటెస్ట్ సినిమా “పుష్ప ది రైజ్” తోని అలాగే దీనికి ముందు చేసిన మరో భారీ హిట్ సినిమా “అల వైకుంఠపురములో” సినిమాలతో ఒక్క నేషనల్ వైడ్ గా మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్ కూడా అదరగొట్టాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ అయితే అల్లు అర్జున్ వీడియోస్ చేసి ఎంత సెన్సేషన్ చేసాడో కూడా చూసాం.

అప్పుడు బుట్ట బొమ్మ నుంచి రీసెంట్ గా పుష్ప రాజ్ మాస్ డైలాగ్ తో అదరగొట్టి ఇంకోసారి వైరల్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ పుష్ప పై ఇంకో వీడియో చేసి అంతకు మించి వైరల్ అవుతున్నాడు. పుష్ప లోని శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్ ని కళ్లద్దాలు పూల చొక్కా లాంటిది వేసుకొని బన్నీ లా స్టెప్ వేసాడు. దీనితో ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ అయితే మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే డేవిడ్ వార్నర్ కూడా బన్నీ తో పాటే తగ్గేదేలే అంటున్నాడు.

సంబంధిత సమాచారం :