మళ్ళీ యూట్యూబ్ లోకి వచ్చిన ధనుష్ సెన్సేషనల్ హిట్ సాంగ్.!

Published on May 18, 2022 11:04 am IST

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడైన ధనుష్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలు అనేక భాషల్లో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే థియేట్రికల్ గా మాత్రం తనకి గత కొంత కాలం నుంచి సరైన హిట్ అయితే లేదు. అయితే థియేట్రికల్ గా వచ్చిన పలు చిత్రాల్లో అయితే తన ముందు హిట్ “మారి” కి సీక్వెల్ గా తీసిన మారి 2 నుంచి వచ్చిన ఓ సాంగ్ అయితే గ్లోబల్ గా బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అయ్యింది.

యువన్ శంకర్ రాజా ఇచ్చిన “రౌడీ బేబీ” అనే సాంగ్ అప్పట్లో సెన్సేషనల్ హిట్ కాగా వీడియో సాంగ్ వచ్చాక అయితే అది ఇండియన్ సినిమా నుంచి ఫాస్టెస్ట్ 1 బిలియన్ వ్యూస్ అందుకున్న సాంగ్ గా నిలిచి భారీ హిట్ అయ్యింది. అలా ఇప్పటివరకు 1.3 బిలియన్ వ్యూస్ రాగా అకస్మాత్తుగా ఆ వీడియో సాంగ్ ని యూట్యూబ్ వారు పలు కారణాల చేత తొలగించారు.

దీనితో సోషల్ మీడియాలో ఈ టాక్ వైరల్ అయ్యింది. అయితే ఇపుడు మళ్ళీ ధనుష్ అభిమానులకి గుడ్ న్యూస్ వాచినట్టు తెలుస్తుంది. ఈ సినిమా నిర్మాతలు సమస్యలు సెట్ చేసి మళ్ళీ సాంగ్ అదే వ్యూస్ మరియు లైక్స్ తో తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. దీనితో అయితే ధనుష్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :