“సర్కారు వారి పాట” ఫస్ట్ సింగిల్ పై మళ్ళీ డౌట్స్?

Published on Jan 6, 2022 8:00 am IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న మోస్ట్ స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం నుంచి సాలిడ్ అప్డేట్స్ కోసం అయితే అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ జనవరి నెల సంక్రాంతి నుంచి ఆ అప్డేట్స్ మొదలు అవుతాయని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కానీ ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు దీనిపైనే మళ్ళీ డౌట్స్ స్టార్ట్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ మళ్ళీ వాయిదా పడొచ్చేమో అని అందుకే సాంగ్ ఇంకా లేట్ గా రావచ్చని ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి.

కానీ ఇంకా ఇందులో ఎలాంటి క్లారిటీ లేదు. టాలీవుడ్ లో ఈ సాంగ్ కోసం అయితే చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :