టాక్..”ఆచార్య” రిలీజ్ పై మళ్ళీ గాసిప్స్..!

Published on Dec 19, 2021 10:00 pm IST


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన బిగ్ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం “ఆచార్య”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఆల్రెడీ షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని విడుదలకి రెడీగా ఉంది.

అయితే ఈ సినిమా రిలీజ్ కోసం ఎప్పుడెప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నవారికి ఫిబ్రవరి 4 అంటూ మేకర్స్ ఒక సమాధానం ఇచ్చారు. అయితే ఎట్టకేలకు ఎలాగో డేట్ ని అనౌన్స్ చేసేసినా ఇప్పుడు మళ్ళీ కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. బహుశా ఒకవేళ ఉంటే విడుదలలో మళ్ళీ మార్పు ఉండొచ్చట.

ఫిబ్రవరి నుంచి షిఫ్ట్ చేసే వేసవి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలా అని పునః పరిశీలనలో మేకర్స్ ఉన్నారని ఇప్పుడు వినిపిస్తున్న నయా గాసిప్. అయితే ఇంకా ఇందులో ఎలాంటి క్లారిటీ లేదు కానీ ముందు రోజుల్లో ఏమన్నా వస్తుందేమో చూడాలి. మరి ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటించగా పూజా హెగ్డే తనకి హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం :