పవన్‌తో హరీశ్, దేవిల కాంబినేషన్.. మరోసారి హిట్ కొట్టేనా!

dsp harish

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల గ్యాప్ తరువాత మళ్ళీ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్‌లో మంచి హిట్ టాక్ సంపాదించిన పింక్ రీమేక్‌ వేణు శ్రీరామ్ దర్శకత్వం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు పవన్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే.

అయితే ఈ రెండు సినిమాల తరువాత పవన్ తన 28వ సినిమాను హరీశ్ శంకర్‌తో ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఎనిమిదేళ్ళ క్రితం హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఆ సినిమా అంతలా హిట్ కొట్టేందుకు పవన్ యాక్టింగ్, హరీశ్ శంకర్‌ల కృషితో పాటు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఒక పెద్ద కారణమనే చేప్పాలి. అయితే పవన్ 28 వ సినిమా కోసం తిరిగి ఈ ఇద్దరి జోడి జతకట్టడంతో కథ పరంగా, మ్యూజిక్ పరంగా ఫ్యాన్స్ కోరుకుంటున్న ఆ బ్లాక్‌బస్టర్ హిట్ మరోసారి రిపీట్ అవుతుందో లేదో చూడాలి మరీ.

https://twitter.com/harish2you/status/1259853375384018944

Exit mobile version