“డీజే టిల్లు” కి మరోసారి హీరోయిన్ మార్పు.!

Published on Nov 29, 2022 8:00 am IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ కెరీర్ లో బ్రేక్ ఇచ్చిన సాలిడ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం “డీజే టిల్లు”. మరి ఆ చిత్రం స్క్రిప్ట్ లో తాను కూడా వర్క్ చేయగా ఈ సాలిడ్ రోలర్ కాస్టర్ రైడ్ ఎంటర్టైనర్ కి సీక్వెల్ ని అనౌన్స్ చేయడంతో కూడా మరిన్ని అంచనాలు దీనిపై నెలకొన్నాయి.

అయితే మొదటి సినిమాలో తన పాత్రతో పాటుగా యంగ్ హీరోయిన్ నేహా శెట్టి రోల్ కూడా మంచి హైలైట్ గా నిలిచింది. అయితే నెక్స్ట్ చిత్రం “టిళ్లు స్క్వేర్” కి నేహా శెట్టి నుంచి సినిమా అనుపమ పరమేశ్వరన్ కి మారింది. మరి ఈసారి కొత్త కంటెంట్ కావడంతో సినిమాలో మార్పులు కూడా రావడంతో అనుపమ ఈ చిత్రంలోకి వచ్చింది.

ఇక ఇప్పుడు అయితే ఈ చిత్రంలో మరోసారి హీరోయిన్ మారినట్టుగా సినీ వర్గాలు కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఈసారి అనుపమ ప్లేస్ లో అయితే ప్రేమమ్, శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ మడోనా సెబాస్టియన్ లాక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :