వైరల్ : “పుష్ప” మ్యానరిజంతో మరోసారి ఇండియన్ స్టార్ క్రికెటర్.!

Published on Feb 25, 2022 9:40 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ “పుష్ప ది రైజ్” భారీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సహా ఈ సినిమాకి వర్క్ చేసిన అందరి కెరీర్ లలోని ఫస్ట్ పాన్ ఇండియా హిట్ గా ఈ చిత్రం నిలిచింది.

మరి ఈ సినిమా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఎన్నో అంశాల్లో “తగ్గేదేలే” అంటూ అల్లు అర్జున్ చేసే మ్యానరిజం కూడా ఒకటి. మరి ఇది కూడా పాన్ ఇండియా హిట్ అయ్యిందని చెప్పాలి. ఎంతో మంది ఇండియన్ బిగ్ స్టార్స్ ఈ మ్యానరిజం ని చేసి పుష్ప పై మరింత క్రేజ్ తీసుకొచ్చారు. మరి ఈ లిస్ట్ లో ఇండియన్ స్టార్ క్రికెటర్ జడేజా కూడా ఒకడు.

అప్పుడు పుష్ప రీల్ చెయ్యడమే కాకుండా అల్లు అర్జున్ లా మేకోవర్ కూడా చేసి ఓ రేంజ్ కిక్ ఇచ్చాడు. ఇక నిన్న శ్రీలంక తో జరిగిన మొదటి మ్యాచ్ లో తాను మొదటి వికెట్ తీసుకోగా మళ్ళీ తగ్గేదేలే అంటూ తాను చేసిన మ్యానరిజం హైలైట్ గా మారిపోయింది. దీనితో ఈ విజువల్ ఇప్పుడు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :