వైరల్ : రామ్ రోల్ పై కేమరూన్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Feb 12, 2023 10:05 am IST

ప్రస్తుతం వరల్డ్ సినిమా అంతా ఎంతో ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మన టాలీవుడ్ అండ్ ఇండియన్ ప్రైడ్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. దర్శక శిఖరం ఎస్ ఎస్ రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో చేసిన ఈ సెన్సేషనల్ మల్టీ స్టారర్ అంచనాలకి అందని గ్లోబల్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా పై ఏకంగా హాలీవుడ్ టాప్ దర్శకులే అనేక ప్రశంసలు అందించడం కేజ్రీగా మారింది.

మరి వారిలో వరల్డ్ నెంబర్ 1 సినిమాల దర్శకుడు జేమ్స్ కేమరూన్ కూడా ఒకరు కాగా ఆ మధ్య ఓ ఇంటెర్నేషల్ అవార్డు మీట్ లో జక్కన్నతో కెమరూన్ మాట్లాడి పలు కామెంట్స్ చేయడం ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. ఇక లేటెస్ట్ గా అయితే హాలీవుడ్ మీడియాలో మరోసారి సినిమాలో రామ్ చరణ్ పోషించిన రామరాజు పాత్ర కోసం గాను అలాగే దర్శకుడు రాజమౌళి కోసం మాట్లాడ్డం వైరల్ గా మారింది.

సినిమాలో రామ్ పాత్ర చాలా ఛాలెంజింగ్ రోల్ అని దాని కోసం తర్వాత రియలైజ్ అయ్యినపుడు హార్ట్ బ్రేకింగ్ గా ఉంటుంది అని కొనియాడారు అలాగే రాజమౌళి తో మొన్న ఎక్కువసేపు ఈ రోల్ కోసం మాట్లాడ్డం కుదరలేదు అని వారు చెప్పడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిగా మారి వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :