టాక్..మరోసారి తన హిట్ బ్యానర్ లో కొరటాల..?

Published on Jun 17, 2022 2:00 am IST

తన సినిమాలతో టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కొరటాల శివ. అయితే రీసెంట్ గా మాత్రం తాను చేసిన మెగా మల్టీ స్టారర్ “ఆచార్య” అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ నెక్స్ట్ ఎన్టీఆర్ తో చేసే సినిమాతో మాత్రం తన ముందు అన్ని సినిమాలు కలిపితే ఎంత పెద్ద హిట్ అయ్యాయో అంతా కలిపి ఒక్క ఎన్టీఆర్ సినిమాతో ఇస్తున్నా అన్నట్టుగా మాస్ ప్రామిస్ ని అందించారు.

దీనితో ఇప్పుడు కొరటాల లైనప్ లో అంతా ఆ సినిమా కోసం ఎదురు చూస్తుండగా లేటెస్ట్ గా తన లైనప్ పై ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. కొరటాల తన కెరీర్ లో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి భారీ హిట్స్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ మళ్ళీ ఓ భారీ సినిమా చేయనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. అలాగే హీరోగా అయితే ఓ మెగా హీరో ఉండొచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి కానీ ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. మరి రానున్న రోజుల్లో అయితే ఈ కాంబోపై క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :