ఓటిటిలో “కాంతారా” రిలీజ్ పై మళ్ళీ కొత్త బజ్.!

ఓటిటిలో “కాంతారా” రిలీజ్ పై మళ్ళీ కొత్త బజ్.!

Published on Nov 3, 2022 3:00 PM IST

కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హీరోగా అలాగే తన స్వీయ దర్శకత్వంలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ డివైన్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “కాంతారా”. తెలుగు హిందీ కన్నడ భాషల్లో సంచలనం రేపుతున్న ఈ చిత్రం ఇప్పుడుకి కూడా థియేటర్స్ లో భారీ వసూళ్లు నమోదు చేస్తూ దూసుకెళ్తుంది. ఇక థియేటర్స్ లో ఈ స్ట్రాంగ్ రన్ ఈ చిత్రం కొనసాగిస్తుండగా మరోపక్క అయితే సినిమా ఓటిటి రిలీజ్ కి సంబంధించి రూమర్స్ కూడా ఎక్కువే వినిపిస్తున్నాయి.

కానీ ఈ చిత్రం ఓటిటి రిలీజ్ అప్పుడే ఉండదు అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కానీ సినీ వర్గాల్లో ఆల్ మోస్ట్ స్ట్రీమింగ్ దగ్గరకి వచ్చింది అని మళ్ళీ రూమర్స్ వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా ఈ చిత్రం ఈ నవంబర్ 18నే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండనుంది అని తెలుస్తుంది. మరి దీనిపై మాత్రం అధికారిక క్లారిటీ వస్తేనే తెలుస్తుందని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని అజనీష్ సంగీతం అందించగా తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు