“ఎన్టీఆర్ 30” హీరోయిన్ పై మరోసారి కొత్త బజ్ కానీ..?

“ఎన్టీఆర్ 30” హీరోయిన్ పై మరోసారి కొత్త బజ్ కానీ..?

Published on Nov 8, 2022 7:04 AM IST


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబోలో అనౌన్స్ చేసిన భారీ పాన్ ఇండియా చిత్రం కోసం అందరికీ తెల్సిందే. రీసెంట్ గానే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని పోస్ట్ చేయగా అభిమానుల్లో కూడా నూతన ఉత్సాహం నెలకొంది. ఇక ఈ పనులు ఓ పక్క జరుగుతున్నాయి. కానీ సినిమా హీరోయిన్ విషయం లో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యినట్టుగా రూమర్స్ వచ్చాయి. కానీ మళ్లీ లేటెస్ట్ గా మరికొందరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ పేర్లు కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ బజ్ లో ఎలాంటి నిజము లేనట్టు గా తెలుస్తోంది. మరి త్వరలోనే హీరోయిన్ ఎవరు అనే అంశం పై కూడా అనౌన్స్మెంట్ వచ్చే చాన్సు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ భారీ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు