మరోసారి హాట్ టాపిక్ గా మహేష్ – రాజమౌళి భారీ సినిమా!

Published on Feb 2, 2022 10:00 pm IST

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా లేటెస్ట్ గా నటిస్తున్న సాలిడ్ సినిమా “సర్కారు వారి పాట” చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉండగా దీని తర్వాత మహేష్ రెండు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లు చేస్తుండగా వాటిలో సంచలనాలు నమోదు చేసి భారీ చిత్రం రాజమౌళి తో చేసే సినిమా అని చెప్పాలి. అయితే అసలు ఈ కాంబో అనౌన్స్ అయ్యిన నాటి నుంచే హాలీవుడ్ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. ఈ సినిమాకి కథ అందిస్తున్న ప్రముఖ స్టార్ రచయిత విజయేంద్ర ప్రసాద్ దీనికి సంబంధించి ఫుల్ సబ్జెక్టు ని ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో మరోసారి ఈ భారీ చిత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తుంది. మరి ఈ చిత్రాన్ని మహేష్ త్రివిక్రమ్ తో ప్లాన్ చేసిన భారీ సినిమా అనంతరం స్టార్ట్ చెయ్యనున్నాడు.

సంబంధిత సమాచారం :