మరోసారి “మాస్టర్” కాంబినేషన్ రిపీట్ కావడం కన్ఫర్మ్ అట.!

Published on May 22, 2022 11:00 am IST


కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ తలపతి విజయ్ జోసెఫ్ హీరోగా ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లితో ఓ భారీ బై లాంగువల్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం తర్వాత విజయ్ లైనప్ పై మరింత ఆసక్తి నెలకొంది. అయితే విజయ్ ఇప్పటివరకు చేసిన లేటెస్ట్ చిత్రాల్లో భారీ హిట్స్ ఇచ్చిన దర్శకులతో తాను మళ్ళీ చేసిన సందర్భాలు ఉన్నాయి.

అలా తన కెరీర్ లో ఒక సాలిడ్ హిట్ ని ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తో “మాస్టర్” తర్వాత మళ్ళీ ఒకసారి సినిమా చేస్తాడని ఆ మధ్య టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యినట్టు తెలుస్తుంది. తన నెక్స్ట్ సినిమా మళ్ళీ విజయ్ తో ఉందని తెలిపాడు. మరి ఈసారి ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి. ఆల్రెడీ మాస్టర్ కి కూడా సీక్వెల్ ఉందన్నట్టు అప్పుడు హింట్ ఇచ్చాడు. మరి అదే ఉంటుందా లేక కొత్త సినిమానా అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :