ఓటిటిలో మళ్ళీ మంచి సక్సెస్ అందుకున్న నాని.!

ఓటిటిలో మళ్ళీ మంచి సక్సెస్ అందుకున్న నాని.!

Published on Jul 13, 2022 2:00 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ నజ్రియా ఫహద్ తెలుగులో మొదటి ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ చిత్రం “అంటే సుందరానికీ”. దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి అంచనాల నడుమే రిలీజ్ అయ్యింది కానీ తెలుగు స్టేట్స్ లో అయితే అనుకున్న టార్గెట్ ని మాత్రం రీచ్ కాలేకపోయింది. కానీ సినిమా చూసిన ఆడియెన్స్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ ని అయితే తెచ్చుకుంది.

ఇక ఇప్పుడు రీసెంట్ గా ప్రముఖ ఓటిటి యాప్ నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం రిలీజ్ కాగా దీనికి మళ్ళీ మంచి రెస్పాన్స్ ప్రపంచ వ్యాప్తంగా లభిస్తుంది. నాని గత చిత్రాలు టక్ జగదీష్, శ్యామ్ సింగ రాయ్ తర్వాత ఓటిటిలో కి వచ్చాక ఈ సినిమాకి కూడా పలు భాషల ఆడియెన్స్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వస్తుండడం విశేషం. దీనితో అయితే మళ్ళీ నాని కి ఓటిటి లో సాలిడ్ సక్సెస్ దక్కిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు