పవన్ – ఆలీ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్నారట.!

Published on Jun 21, 2022 12:33 pm IST


టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ కి మంచి క్రేజ్ ఉంది. అది అయితే హీరో లేదా దర్శకుడు, హీరో హీరోయిన్ కావచ్చు అలాగే వాటితో ఓ హీరో మరియు కమెడియన్ కూడా కావచ్చు. అలాంటి ఒక ఎవర్ గ్రీన్ కాంబోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు కమెడియన్ ఆలీల కాంబో కూడా ఒకటి. సినిమా లైఫ్ పరంగా అయితే వీరిద్దరిదీ మంచి బాండింగ్ అని అందరికీ తెలిసిందే.

ఎన్నో సినిమాల్లో వీరిద్దరి కామెడీ సీన్స్ ని ఇష్టపడే వారు ఉన్నారు. ఆల్ మోస్ట్ పవన్ అన్ని సినిమాల్లో ఉన్న ఆలీ పవన్ “అజ్ఞ్యాతవాసి” సినిమా నుంచి అయితే మిస్ అవుతున్నాడు. దీనికి వేరే కారణాలు ఏమన్నా ఉంది ఉండొచ్చనే టాక్ ఉంది కానీ తాజాగా సిల్వర్ స్క్రీన్ పై మళ్ళీ తమ కాంబో కనిపిస్తుంది అని ఆలీ క్లారిటీ ఇచ్చాడు.

తాజాగా తాను చేస్తున్న టెలివిజన్ షో “ఆలీతో సరదాగా” లో “సమ్మతమే” టీం యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరియు హీరోయిన్ చాందిని చౌదరి లతో మాట్లాడుతూ ఆలీ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. మళ్ళీ త్వరలోనే చూస్తారు అన్నట్టుగా ఆలీ వారితో చెప్పడం ఆసక్తిగా మారింది. మరి ఆ సినిమా ఏంటి ఎప్పుడు అనేవి మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :