మరోసారి చర్చగా మారిన పవన్ భారీ రెమ్యూనరేషన్.!

Published on Jun 30, 2022 3:00 am IST

మన టాలీవుడ్ దగ్గర దగ్గర భారీ డిమాండ్ ఉన్నటువంటి స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఇప్పుడు పవన్ కి ఉన్న టైం లో పవన్ డేట్స్ దొరకడమే అదృష్టంగా నిర్మాతలు భావిస్తున్నారు. మరి ఇలా కాస్త టైట్ షెడ్యూల్ లోనే పవన్ తన రెండు పనులు చూసుకుంటుండగా సినిమాల విషయానికి వస్తే మళ్ళీ తన రెమ్యునరేషన్ చర్చనీయాంశంగా మారింది.

గతంలో భీమ్లా నాయక్ కే రోజుకి భారీ మొత్తంలో పవన్ ఛార్జ్ చేసాడని టాక్ రాగా ఇప్పుడు అలాగే మరో రీమేక్ వినోదయ సైతం కి కూడా భారీ మొత్తంలో పారితోషకం అందుకుంటున్నట్టుగా ఓ బజ్ వైరల్ గా మారింది. ఈ చిత్రానికి పవన్ సుమారు 20 రోజులు కేటాయించగా..

అందుకు గాను రోజుకి రెండున్నర కోట్లు రెమ్యునరేషన్ అంటూ ఓ టాక్ ఇపుడు అభిమానుల్లో వైరల్ గా మారింది. మరి అప్పుడు భీమ్లా టైం లో కూడా రోజుకి ఇంతని ఓ టాక్ చర్చగా మారగా ఇప్పుడు ఈ చిత్రానికి మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. మరి వీటిలో ఎంతమేర నిజముందో తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :